బాబు కు హరీష్ లేఖ … లేఖలో ఏముందంటే
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీల నాయకులు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. ఎత్తులు పై ఎత్తులతో రాజకీయం రసకందాయం లో పడింది. ఇక బాహాటంగా సాగుతున్న విమర్శలు, ప్రతి విమర్శలే కాకుండా బహిరనగా లేఖలు సైతం ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయడంపై ప్రజలకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్న మంత్రి హరీష్‌రావు… చంద్రబాబుకు 19 ప్రశ్నలను సంధించారు. నరనరాన తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. అసలు చంద్రబాబుకు తెలంగాణ పదమే గిట్టదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని హరీష్ ఆరోపించారు. కేంద్రానికి రాసిన లేఖలను బయటపెట్టారు. చంద్రబాబును చూసి… ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని, అంతలా రంగులు మారుస్తున్నారంటూ హరీష్ ఎద్దేవా చేశారు.. బాబుది ఎంత సంకుచిత ధోరణో, ఎంత మరుగుజ్జుతనమో… హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించి భవనాలను చూస్తే తెలుస్తుందన్నారు. . చంద్రబాబు… అప్పుడూ ఇప్పుడూ తెలంగాణ వ్యతిరేకేనన్న హరీష్‌రావు… తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Comments
Post a Comment